అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గర్భిణీలు పారాసెటమాల్ (టైలెనాల్) వాడితే పిల్లల్లో ఆటిజం ప్రమాదం పెరుగుతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే, ప్రపంచ ఆరోగ్య సంస్థ మాజీ చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ సౌమ్య స్వామినాథన్, ఇతర వైద్య నిపుణులు ఈ వాదనను ఖండించారు. పారాసెటమాల్ సురక్షితమైన మందు అని, దీనికి, ఆటిజంకు మధ్య సంబంధం ఉన్నట్టు శాస్త్రీయ ఆధారాలు లేవని స్పష్టం చేశారు. ప్రసూతి వైద్యులు, గైనకాలజిస్టుల సమాఖ్య (FIGO) కూడా దీని వాడకాన్ని సిఫార్సు చేస్తుందన్నారు. టైలెనాల్ తయారీ సంస్థ కూడా ట్రంప్ వాదనను తోసిపుచ్చింది.