ఈరోజు బ్రేకింగ్ న్యూస్ ని మీరు కింద చూడవచ్చు


Dec 09, 2025, 15:12 IST/

అక్వేరియంలోకి వెళ్లి.. రూల్స్ బ్రేక్ చేస్తే గిట్లుంటది.. వైరల్ వీడియో

Dec 09, 2025, 15:12 IST
చైనాలోని ఒక అక్వేరియంలో, బహిరంగ ప్రదేశాల్లో సిగరెట్ తాగడం నిషేధించబడినప్పటికీ, ఒక వ్యక్తి సిగరెట్ తాగుతుండగా, ఒక బెలూగా తిమింగలం నీటిని చిమ్మి అతని సిగరెట్‌ను ఆర్పేసింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే, బీజింగ్ న్యూస్‌ కథనం ప్రకారం, ఇది యాదృచ్ఛికం కాదని, అగ్ని భద్రతపై అవగాహన పెంచడానికి అక్వేరియం నిర్వాహకులు స్క్రిప్ట్ చేసినట్లు తెలుస్తోంది. సిగరెట్ వెలిగించిన వ్యక్తి అక్వేరియం ఉద్యోగి అని, తిమింగలానికి నీరు చిమ్మడానికి శిక్షణ ఇచ్చారని సమాచారం.