భారత్‌లో పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు?

15140చూసినవారు
భారత్‌లో పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు?
హర్మూజ్‌ జలసంధి ప్రాంతంలో చమురు రవాణాకు అంతరాయం, మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలతో ప్రపంచ ఇంధన మార్కెట్‌పై ఒత్తిడి పెరిగింది. దీంతో అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్‌తో పాటు పలు దేశాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగియాయి. అయితే ఈ ప్రభావం ఇప్పుడు భారత్‌పైనా పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముడిచమురు ధరలు పెరిగితే దేశీయంగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై ఒత్తిడి పెరగడంతో పాటు రవాణా, నిత్యావసర వస్తువుల ధరలు కూడా ప్రభావితమయ్యే అవకాశం ఉంటుందని అంటున్నారు.

సంబంధిత పోస్ట్