కాంగ్రెస్, బీజేపీలకు వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తా: KTR(వీడియో)

22చూసినవారు
TG: జీహెచ్ఎంసీ పరిధిలోని BRS నేతలతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక సమావేశం నిర్వహించారు. తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణపై నాయకులకు దిశానిర్దేశం చేశారు. "మరో ఏడాది పాటు కష్టపడి పనిచేస్తే.. ఇప్పుడు మనల్ని సతాయిస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్న కాంగ్రెస్, బీజేపీలకు మిత్తితో (వడ్డీతో) సహా తిరిగి చెల్లించే బాధ్యత నాది" అని ఆయన భరోసానిచ్చారు. కేటీఆర్ చేసిన ఈ ఘాటు వ్యాఖ్యలతో గ్రేటర్ గులాబీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.

సంబంధిత పోస్ట్