సీఎం ఆదేశిస్తే రాజీనామా చేస్తా: ఎమ్మెల్యే దానం

12069చూసినవారు
TG: ఎన్నికల్లో ఫైట్ చేయడం, గెలవడం తన రక్తంలోనే ఉందని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. శుక్రవారం నియోజకవర్గంలో పర్యటన సందర్భంగా అనర్హత వేటు అంశంపై స్పందిస్తూ.. 'రాజీనామా ప్రస్తావన ఇంకా రాలేదు. సీఎం రేవంత్ ఆదేశిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నాను. నాకు ఎన్నికలు కొత్త కాదు.. ఇప్పటికి 11 సార్లు కొట్లాడిన చరిత్ర ఉంది. అనర్హత అంశంపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది. నా వాదనలు వినిపిస్తాను' అని న్నారు.
Job Suitcase

Jobs near you