ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) తో భవిష్యత్తులో ముప్పు తప్పదంటూ ప్రపంచవ్యాప్తంగా నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తుండగా,
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏఐతో విధ్వంసం అనేది తప్పుడు ప్రచారమని కొట్టిపారేసిన ఆయన, ఈ పుకార్లను నమ్మి ఏఐ అభివృద్ధిని అడ్డుకోవాలని చేసే ప్రయత్నాలను తాను సాగనివ్వనని చెప్పారు. ఈ ప్రయత్నాలను నిరోధించేందుకు త్వరలోనే తాను ‘ఏఐ ఫోర్స్’ తీసుకొస్తానని ట్రంప్ స్పష్టం చేశారు.