దేశంలోని అతి పురాతన బోర్స్‌గా గుర్తింపు పొందిన కలకత్తా స్టాక్ ఎక్స్చేంజ్ (CSE) 117 ఏళ్ల తర్వాత మూతపడే అవకాశం ఉంది. 2013లో సెబీ ఆదేశాల మేరకు ట్రేడింగ్ నిలిపివేయడంతో కార్యకలాపాలు నిలిచిపోయాయి. నియంత్రణ నిబంధనలు పాటించకపోవడం, ట్రేడింగ్ వాల్యూమ్ పడిపోవడం, ఆర్థిక ఒత్తిడి కారణంగా సీఎస్‌ఈ క్రమంగా బలహీనపడింది. బీఎస్ఈ, ఎన్ఎస్ఈ ఆధిపత్యం పెరగడం కూడా దీని పతనానికి కారణం. అయితే సీఎస్‌ఈ మాత్రం మూసివేత వార్తలను ఖండించింది.