TG: ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగుల వయోపరిమితి పెంపుపై రేవంత్ సర్కార్ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. 2022లో గత ప్రభుత్వం జనరల్ అభ్యర్థులకు 44, రిజర్వ్‌డ్ కేటగిరీలకు 49, దివ్యాంగులకు 54 ఏళ్ల వరకు అవకాశం కల్పించింది. అయితే ఆ గడువు ఈ ఏడాది ఫిబ్రవరితో ముగిసింది. దీంతో ఏజ్ లిమిట్‌ను 5 లేదా 10 ఏళ్లు పెంచాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే ప్రకటన వెలువడనున్నట్లు తెలుస్తోంది.