6 నెలలుగా రేషన్ తీసుకోకుంటే కార్డులు రద్దు?

19355చూసినవారు
6 నెలలుగా రేషన్ తీసుకోకుంటే కార్డులు రద్దు?
ప్రజా పంపిణీ వ్యవస్థను (PDS) ప్రక్షాళన చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైందని 'హిందుస్థాన్ టైమ్స్' వెల్లడించింది. గత 6 నెలలుగా రేషన్ తీసుకోని 15.8 మిలియన్ల కార్డులను రద్దు చేయాలని నిర్ణయించిందని తెలిపింది. అయితే, ఈ కార్డులను వెంటనే డేటాబేస్ నుంచి తొలగించకుండా, తాత్కాలికంగా నిలిపివేసి, అర్హులమని నిరూపించుకోవడానికి మూడు నెలల సమయం ఇవ్వనుందని పేర్కొంది. ఈలోగా e-KYC పూర్తి చేసుకున్న వారికి కార్డులు తిరిగి యాక్టివ్ అవుతాయని తెలిపింది.

సంబంధిత పోస్ట్