
కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో వేతనాలు, పెన్షన్ల పెంపు
ప్రభుత్వ రంగంలోని జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలు, నాబార్డు, RBI ఉద్యోగులకు, పెన్షనర్లకు వేతనాలు, పింఛను పెంపుదలకు కేంద్రం అధికారిక ముద్ర వేసింది. ఈ నిర్ణయంతో సుమారుగా 46,322 మంది ఉద్యోగులు, 46 వేల మంది పెన్షనర్లు, కుటుంబ పింఛనుదారులు లబ్ధి పొందనున్నారు. బీమా ఉద్యోగులకు 2022 ఆగస్టు, నాబార్డ్ ఉద్యోగులు, పెన్షనర్లు, RBI పెన్షనర్లకు 2022 నవంబర్ నుంచి ఈ పెంపు వర్తించనుంది. దీంతో బీమా ఉద్యోగులకు 12.41%, నాబార్డ్-20% జీతం పెరగనుంది. RBI పెన్షనర్లకు 10% పెరగనుంది.




