భారీగా తగ్గనున్న వైన్, కివీ పండ్ల ధరలు!

58చూసినవారు
భారీగా తగ్గనున్న వైన్, కివీ పండ్ల ధరలు!
ఇండియా- న్యూజిలాండ్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ప్రభావంతో కొన్ని దిగుమతి వస్తువుల ధరలు తగ్గే అవకాశం ఉంది. న్యూజిలాండ్ నుంచి వచ్చే ఉన్ని, బొగ్గు, గొర్రె మాంసం ధరలు వెంటనే తగ్గనున్నాయి. అలాగే కలప, అటవీ ఉత్పత్తులపై పన్నులు ఎత్తివేయడంతో ఫర్నీచర్ ధరలు కూడా దిగొచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. సీఫుడ్, యాపిల్స్, కివీ వంటి పండ్ల ధరలు వచ్చే ఏడేళ్లలో క్రమంగా తగ్గుతాయి. ఇక మనుకా హనీ ధరలు ఐదేళ్లలో, డెయిరీ ఉత్పత్తులు (ఇన్‌ఫ్యాంట్ ఫార్ములా) ఏడేళ్లలో తగ్గుతాయని అంచనా. అలాగే వైన్‌ ధరలు కూడా దశలవారీగా తగ్గి పదేళ్లలో వినియోగదారులకు అందుబాటులోకి వచ్చే ఛాన్స్ ఉంది.

సంబంధిత పోస్ట్