వినాయక నిమజ్జనం వేళ ఈ జిల్లాల్లో వైన్స్ బంద్

6చూసినవారు
వినాయక నిమజ్జనం వేళ ఈ జిల్లాల్లో వైన్స్ బంద్
గణేష్ నిమజ్జనాన్ని పురస్కరించుకుని శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో రేపు వైన్స్ షాపులను అధికారులు బంద్ చేయనున్నారు. ఈ మేరకు WGL, కరీంనగర్ జిల్లాల్లో బుధవారం(SEP 23) ఉదయం 6 గంటల నుంచి గురువారం(SEP24) ఉదయం 6 గంటల వరకు మద్యం దుకాణాలు, బార్లు మూసి ఉంటాయని అధికారులు తెలిపారు. కాగా నిజామాబాద్‌, APలోని కర్నూల్‌లో ఇవాళే వైన్సులను బంద్ చేశారు. అటు HYD పరిధిలో శుక్రవారం (SEP 25) వైన్స్ బంద్ కానున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్