నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం

31చూసినవారు
నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. డిసెంబర్ 19 వరకు మొత్తం 15 రోజుల పాటు కొనసాగనున్నాయి. ఈ ఉదయం 11 గంటలకు సెషన్స్ ప్రారంభం కానుండగా, ఇటీవల మరణించిన ఎంపీలకు తొలుత సంతాపం తెలుపనున్నారు. తాజా సమావేశాల్లో 14 బిల్లులను ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అటు కీలక అంశాలపైన ఎన్డీయే ప్రభుత్వాన్ని నిలదీయడానికి ప్రతిపక్షాలు సన్నద్ధం అవుతున్నాయి. దీంతో అధికార, ప్రతిపక్షాల మధ్య వాడీవేడిగా చర్చ జరిగే ఛాన్స్ ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్