TG: సిద్ధిపేట జిల్లా దుబ్బాకలో ఒక వ్యక్తి తన కొత్త ఇంటి నిర్మాణానికి వినూత్నంగా ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం ఫోటోతో పాటు 'అప్పు చేసి కడుతున్న బ్రో' అనే వాక్యాన్ని జోడించారు. ఈ ఫ్లెక్సీని చూసినవారు నవ్వులు చిందిస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో ఇలాంటి హాస్యభరితమైన రీల్స్, వీడియోలు జోడించడం సాధారణమైనప్పటికీ, ఇంటి నిర్మాణానికి ఇలాంటి ఫ్లెక్సీ పెట్టడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.