ముంబైలోని బోరివాలి వెస్ట్ ఎంహెచ్‌బీ కాలనీలో తాజాగా షాకింగ్ ఘటన జరిగింది. ఓ మహిళ రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా వీధికుక్క ఆమెపై దాడి చేసింది. అకస్మాత్తుగా వెనుక నుండి పరిగెత్తుకుంటూ వచ్చి ఆమె కాలును కరిచింది. నొప్పితో మూలుగుతూ ఉన్న ఆ మహిళను స్థానికులు వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి నిలకడగా ఉంది. దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.