
జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై జోరుగా బెట్టింగ్లు!
TG: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రెండు తెలుగు రాష్ట్రాల్లోని బెట్టింగ్ రాయుళ్లకు పండగలా మారింది. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి బెంట్టింగ్ల జోరు మొదలైంది. సొంతంగా సర్వేలు చేయించుకుంటూ, బంధువులకు ఫోన్లు చేసి ఆరా తీస్తున్నారు. ఇప్పటి వరకు దాదాపు రూ.600 కోట్లు పందేలు కాసినట్లు తెలుస్తోంది. ఎన్నికల నాటికి రూ.1400 కోట్లకు చేరొచ్చని అంచనా వేస్తున్నారు. ప్రత్యేక సర్వేలకు రూ.70 వేల నుంచి లక్షవరకు చెల్లిస్తున్నట్లు తెలుస్తోంది.




