ఆర్టీసీ బస్సులో కండక్టర్‌పై మహిళ వీరంగం.. వీడియో వైరల్‌

22చూసినవారు
AP: ఎన్టీఆర్‌ జిల్లా జగ్గయ్యపేట డిపోకు చెందిన ఆర్టీసీ బస్సులో ఒక మహిళ ప్రయాణిస్తూ వీరంగం సృష్టించింది. విజయవాడ నుంచి పెనుగంచిప్రోలు వెళుతున్న పల్లెవెలుగు బస్సులో ఫుట్‌పాత్‌పై ప్రమాదకరంగా ప్రయాణిస్తూ, కండక్టర్, డ్రైవర్‌పై దాడికి పాల్పడింది. తన ఫోటో తీసి పోలీసులకు చూపించమని, అది చూసి పోలీసులకే దడ పుడుతుందని బెదిరించింది. తోటి ప్రయాణికులను కూడా దూషించింది. పరిటాలలో దిగాల్సిన ఆమెను, కంచికచర్ల పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. అక్కడ ఫిర్యాదు చేయగా, పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత పోస్ట్