ఫోన్‌కు అశ్లీల వీడియోలు.. బస్సు డ్రైవర్‌ను చితక్కొట్టిన మహిళ (వీడియో)

14100చూసినవారు
మహారాష్ట్రలోని సింధుదుర్గ్ జిల్లాలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళలకు బస్సు డ్రైవర్ అసభ్యకరమైన వీడియోలు షేర్ చేశాడు.  దీంతో మహిళ ప్రైవేటు బస్సు డ్రైవర్ ను పబ్లిక్‍గానే చితక్కొట్టింది. అయితే సదరు మహిళ కొన్ని నెలల క్రితం కంకవ్లిలోని ఒక ప్రైవేటు ట్రావెల్స్ కంపెనీ కార్యాలయం ద్వారా బస్సు టికెట్ బుక్ చేసుకుంది. కంకవ్లి- ముంబయి మధ్య ప్రయాణాలు చేసేందుకు తరచుగా అదే కంపెనీ బస్సు సర్వీసును ఉపయోగించేంది. ఈ క్రమంలో టికెట్ బుకింగ్ రికార్డుల నుంచి ఆ మహిళ ఫోన్ నంబర్‌ను తీసుకున్న బస్సు డ్రైవర్ మెసేజింగ్ యాప్‌ల ద్వారా ఆమెకు అశ్లీల వీడియోలను పంపిస్తూ వేధించడం ప్రారంభించినట్లు పేర్కొంది.

సంబంధిత పోస్ట్