కర్ణాటకలోని పీన్యా సమీపంలో బీఎంటీసీ బస్సులో డ్రైవర్, మహిళా ప్రయాణికురాలి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. సదరు మహిళ సీటు వెనుక నుంచి డ్రైవర్‌పై చేయి చేసుకుంది. వెంటనే అతనూ అమెని కొట్టాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బెంగళూరు సిటీ పోలీసులు ఫిర్యాదును సంబంధిత అధికారులకు పంపించి, తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. నెటిజన్లు ఈ ఘటనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.