యూపీలోని బరేలీలో షాకింగ్ ఘటన వెలుగుచూసింది. కేవలం రూ.1200 రేషన్ బాకీ ఉందన్న నెపంతో ఒక మహిళ, పేద యువతిపై అమానుషంగా ప్రవర్తించింది. ఆ బాకీ చెల్లించలేదని యువతిని నడిరోడ్డుపై ఇష్టం వచ్చినట్లు చెంపదెబ్బలు కొడుతూ, జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లి దారుణంగా హింసించింది. బాధితురాలు ప్రాధేయపడుతున్నా కనికరించకుండా ఆ మహిళ రెచ్చిపోయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.