‘గంగా యమునా సరస్వతి’ అనే టీవీ సీరియల్ ఓ మహిళ ఐఏఎస్ కావడానికి ప్రేరణ నిలిచింది. ఈ ఘటన తమిళనాడులోని ఈరోడ్ జిల్లాలోని సత్యమంగళం పట్టణంలో జరిగింది. సి.వనమతి అనే మహిళ సిరియల్ చూసి ఎలాగైనా ఐఏఎస్ కావాలని పట్టుదలతో చదివి సాధించింది. ఆమె తండ్రి టాక్సీ డ్రైవర్, కుటుంబ ఆర్థిక పరిస్థితి చాలా సాధారణమైంది. అయినా కూడా ఆమె వెనక్కి తగ్గకుండా ఉద్యోగం సాధించింది. ప్రస్తుతం ఆమె మహారాష్ట్రలోని ముంబైలో రాష్ట్ర పన్ను శాఖలో జాయింట్ కమిషనర్ (ఎన్‌ఫోర్స్‌మెంట్)గా పనిచేస్తున్నారు.