హైదరాబాద్‌లో మహిళ దారుణ హత్య

45485చూసినవారు
హైదరాబాద్‌లో మహిళ దారుణ హత్య
TG: హైద‌రాబాద్ న‌గ‌రంలో మ‌రో దారుణ హ‌త్య చోటు చేసుకుంది. బేగంపేట‌లోని గ్రీన్ ల్యాండ్ ప్రాంతం స‌మీపంలో ఓ మ‌హిళ‌ను గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు దారుణంగా హ‌త్య చేశారు. స్థానికులు గ‌మ‌నించి పోలీసుల‌కు స‌మాచారం అందించారు. ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్న పోలీసులు మృత‌దేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతురాలు అసోం రాష్ట్రానికి చెందిన మ‌హిళ‌గా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.