
కొరటాల శివ తదుపరి చిత్రం వెంకటేష్ తోనేనా?
దర్శకుడు కొరటాల శివ మిర్చి సినిమాతో దర్శకుడిగా మారి ప్రభాస్, మహేశ్ బాబు, జూ.ఎన్టీఆర్ వంటి స్టార్లతో వరుస విజయాలు సాధించారు. ఆచార్య చిత్రం డిజాస్టర్ అయినప్పటికీ దేవరతో రూ.500 కోట్ల కలెక్షన్లు సాధించి సక్సెస్ ట్రాక్ లోకి వచ్చారు. ప్రస్తుతం దేవర 2 పై పనిచేస్తున్న ఆయన తదుపరి చిత్రం విక్టరీ వెంకటేష్ తో ఉండబోతుందని సమాచారం. అందుకు సరిపోయే కథను సిద్ధం చేయగా వెంకటేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. దేవర - 2 తరువాత ఈ చిత్రం రానుంది.




