ఆర్టీసీ బస్సు ఢీకొని మహిళ మృతి

1చూసినవారు
ఆర్టీసీ బస్సు ఢీకొని మహిళ మృతి
AP: విజయనగరం జిల్లా తెర్లాం మండలం పెరుమాలి గ్రామానికి చెందిన కొరగంజి సంగం నాయుడు, తన భార్య శ్రీలతతో కలిసి బైక్‌పై చీపురుపల్లికి వెళ్తున్నారు. ఈ క్రమంలో బొండపల్లి మీదుగా మెరకముడిదాం వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు.. చిన్నఐతంవలస దగ్గర వీరిద్దరూ ప్రయాణిస్తున్న బైక్‌ను ఢీకొట్టింది. శ్రీలత అక్కడికక్కడే మృతి చెందగా.. సంగంనాయుడు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్