కర్ణాటక రాష్ట్రంలోని మంగళూరులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. మృతురాలికి ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో పనిచేస్తున్న మాధవిగా గుర్తించారు. రోడ్డుపై గుంత కారణంగా స్కూటర్‌పై నియంత్రణ కోల్పోయి ఆమె పడిపోయింది. అదే సమయంలో ఆమెపై నుంచి ట్రక్కు దూసుకెళ్లింది. దీంతో మాధవి సంఘటనా స్థలంలోనే మరణించింది. ఈ దృశ్యాలు అక్కడి సీసీటీవీలో రికార్డయ్యాయి. దీంతో అధ్వాన రహదారులపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.