కుక్కను తప్పించబోయి కారు బోల్తా.. మహిళ మృతి

0చూసినవారు
కుక్కను తప్పించబోయి కారు బోల్తా.. మహిళ మృతి
సూర్యాపేట జిల్లా మోతె మండలం మామిళ్లగూడెం దగ్గర జాతీయ రహదారిపై బుధవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒక మహిళ మృతి చెందగా, ఇద్దరు చిన్నారులకు తీవ్ర గాయాలయ్యాయి. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన అనెపర్తి రాణి(38) తన భర్త, ఇద్దరు పిల్లలతో కలిసి హైదరాబాద్ నుంచి సొంత ఊరికి వెళ్తుండగా, మామిళ్లగూడెం వద్ద కుక్క అడ్డు రావడంతో కారు అదుపుతప్పి బోల్తా కొట్టింది. తీవ్ర గాయాలైన రాణిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మరణించింది. గాయపడిన పిల్లలను ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్