ఏపీలో రోజురోజుకి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదాలు ఎక్కువ అవుతున్నాయి. దీంతో ప్రయాణికుల కుటుంబాల్లో తీవ్ర విషాదాలు నింపుతున్నాయి. నిన్న రాత్రి ఏలూరు జిల్లాలో ఇద్దరు మృతి చెందగా తాజాగా సత్యసాయిజిల్లాలో జబ్బర్ ట్రావెల్స్ బస్సు ఐషర్ వాహనాన్ని ఢీకొట్టింది. ఇందులో ఓ మహిళ మృతి చెందగా 8 మంది ప్రయాణికులకు గాయాలవడంతో ఆస్పత్రికి తరలించారు. బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.