రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

87చూసినవారు
రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
TG: ఖమ్మం జిల్లా పెనుబల్లి మండల పరిధిలోని లంకపల్లి గ్రామంలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, చెండ్రుగొండ మండలం రావికంపాడు గ్రామానికి చెందిన గుర్రం వెంకట దాసు, అతని భార్య సంపూర్ణ(45) రావికంపాడు నుంచి.. ఆంధ్రాలోని జిలుగుమిల్లి వెళుతున్నారు. ఈ క్రమంలో పెనుబల్లి(M) లంకపల్లి గ్రామం వద్ద వెనుక నుంచి వస్తున్న లారీ వీరిని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో సంపూర్ణ అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్