అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి

24చూసినవారు
అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి
AP: పొలంలో ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఈ ఘటన నెల్లూరు(D) విడవలూరు(M)లో చోటు చేసుకుంది. ఇందుకూరుపేట(M) గంగపట్నంకు చెందిన కుప్ప కామేశ్వరమ్మ (62)కు విడవలూరులోని గోల్కొండాయతోపు గ్రామంలో పొలం ఉంది. ఈ పొలం విషయంలో స్థానికులతో ఆమెకు వివాదం నడుస్తోంది. శనివారం తన పొలంలో పనులు చేసేందుకు వచ్చారు. అయితే సాయంత్రం ఆమె విగతజీవిగా పడి ఉండటాన్ని స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. హత్యా? లేదా అనారోగ్య సమస్యలతో మృతి చెందారా? అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you