ప్రమాదవశాత్తు బిగిసిన ఉరితాడు.. రీల్ చేస్తుండగా మహిళ మృతి

43చూసినవారు
ప్రమాదవశాత్తు బిగిసిన ఉరితాడు.. రీల్ చేస్తుండగా మహిళ మృతి
ఉత్తరప్రదేశ్‌లోని బాందా జిల్లాలో సోషల్ మీడియా రీల్స్ మోజులో పడి 27 ఏళ్ల మోహిని అనే యువతి ప్రాణాలు కోల్పోయింది. ఇంట్లో ఉరి వేసుకుంటున్నట్లు నటించే సన్నివేశాన్ని చిత్రీకరించే క్రమంలో.. స్టూల్ జారడంతో మెడకు బిగుసుకున్న ఉరితో ఆమె మరణించింది. ఈ విషాదాన్ని మొదట గమనించిన ఆమె నాలుగేళ్ల కుమార్తె కేకలు వేయడంతో ఇరుగుపొరుగు వారు అక్కడికి చేరుకున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్