AP: అల్లూరి జిల్లా పాడేరులో విషాదం చోటు చేసుకుంది. గేమ్మెలి శాంతి అనే గర్భిణీకి అర్ధరాత్రి పురిటినొప్పులు వచ్చాయి. బంధువులు వెంటనే అంబులెన్స్‌కు కాల్ చేశారు. రెండు గంటలైనా అంబులెన్స్ రాకపోవడంతో ఆటోలో ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో ఆమెకు ఆటోలోనే ప్రసవం జరిగింది. పుట్టిన వెంటనే శిశువు మృతి చెందింది. సకాలంలో వైద్యం అంది ఉంటే శిశువును కోల్పోయే పరిస్థితి రాకపోయేదని బాధిత తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు.