ఒకే కాన్పులో నలుగురికి జన్మనిచ్చిన మహిళ

7చూసినవారు
ఒకే కాన్పులో నలుగురికి జన్మనిచ్చిన మహిళ
మధ్యప్రదేశ్‌లోని షియోపూర్‌ జిల్లాలో పూజ అనే మహిళ ఒకే కాన్పులో నలుగురు శిశువులకు (ఇద్దరు మగ, ఇద్దరు ఆడ) జన్మనిచ్చింది. ఈ నెల 4వ తేదీ తెల్లవారుజామున షియోపూర్‌ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో జరిగిన ఈ ప్రసవంలో, నెలలు నిండకముందే (ఏడు నెలలు) పురిటి నొప్పులు రావడంతో దంపతులు ఆందోళన చెందారు. అయితే, నలుగురు శిశువులు ఒక్కొక్కరు సుమారు కిలో బరువుతో క్షేమంగా జన్మించారు. పిల్లల తండ్రి హుకుమ్‌ సుమన్‌ దీనిని దేవుడిచ్చిన వరంగా అభివర్ణించారు.

సంబంధిత పోస్ట్