లోన్ రికవరీ విషయంలో మాట్లాడుతుండగా బ్యాంక్ మేనేజర్ అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపిస్తూ ఓ మహిళ అతనిపై దాడి చేసింది. మేనేజర్ తన చెంపలు, బుగ్గలు తాకాడని ఆరోపిస్తూ చెప్పుతో కొట్టి, మిగిలిన లోన్ వాయిదాలు కట్టనని తెగేసి చెప్పింది. గ్రామీణ వాతావరణంలో జరిగిన ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అనుమతి లేకుండా తాకితే ఎలాంటోడైనా సరే ఇలాగే గట్టిగా సమాధానమివ్వాలని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.