మహిళను నాలుగో అంతస్తు పైనుంచి తోసేసి హత్య

51చూసినవారు
మహిళను నాలుగో అంతస్తు పైనుంచి తోసేసి హత్య
AP: మద్యం మత్తులో ఓ వ్యక్తి తనతో సహజీవనం చేస్తున్న మహిళను భవనం నాలుగో అంతస్తు పైనుంచి తోసేసి హతమార్చాడు. ప.గో. జిల్లా యలమంచిలి మండలం గంగడపాలేనికి చెందిన తాడి సుధాకర్.. రాధ (29) అనే వివాహితతో ఆరేళ్లుగా సహజీవనం చేస్తున్నాడు. సుధాకర్ రోజూ తాగి ఇంటికి వచ్చి రాధతో గొడవ పడేవాడు. గొడవలు తారాస్థాయికి చేరాయి. రాధను నాలుగో అంతస్తుపైకి  తీసుకెళ్లి కిందకి తోసేశాడు. దాంతో ఆమె అక్కడిక్కడే మృతి చెందింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్