పిడుగుపాటుతో మహిళ మృతి

10355చూసినవారు
పిడుగుపాటుతో మహిళ మృతి
TG: పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం బాలరాజుపల్లిలో బుధవారం పిడుగుపాటుతో మారం అంజమ్మ (50) అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. కొత్తూరు గ్రామానికి చెందిన దోనూరు లక్ష్మి (45) తీవ్రంగా గాయపడటంతో ఆమెను కరీంనగర్ లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వ్యవసాయ పనుల నిమిత్తం కూలీలు బాలరాజుపల్లికి వచ్చినప్పుడు ఈ విషాదం చోటుచేసుకుంది.

సంబంధిత పోస్ట్