యూపీలోని పిలిభిత్‌లో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. బ్లాక్‌మెయిలింగ్‌తో విసిగిపోయిన శుభప్రీత్ కౌర్ అనే మహిళ, తన భర్త సతేంద్రతో కలిసి తన మాజీ ప్రియుడు గుర్బాజ్ సింగ్‌ను హత్య చేసింది. ఏప్రిల్ 22న, మూడ్ సెట్ చేస్తాననే నెపంతో శిథిలాల వద్దకు పిలిచి, భర్తతో కలిసి ఇనుప రాడ్, కర్రతో దాడి చేసి చంపారు. మృతదేహాన్ని శిథిలాల్లో దాచి, మొబైల్‌ను కాలువలో పడేశారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో విచారణ చేపట్టగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపారు.