అమెరికా రోడ్లపై స్త్రీ.. వైరల్‌గా మారిన వీడియో

15చూసినవారు
భారతదేశంలో 10 ఏళ్ల క్రితం గ్రామాల్లో ప్రచారంలో ఉన్న 'ఓ స్త్రీ రేపు రా' అనే దెయ్యం కథ ఆధారంగా బాలీవుడ్‌లో వచ్చిన 'స్త్రీ', 'స్త్రీ 2' సినిమాలు ఘన విజయం సాధించాయి. ఇటీవల అమెరికాలో జరిగిన హాలోవీన్ పండుగ సందర్భంగా, ఇండియానాలో నివసిస్తున్న ఓ భారతీయ యువతి 'స్త్రీ' సినిమాలోని దెయ్యం వేషధారణతో వీధుల్లో తిరిగింది. దీనికి సంబంధించిన వీడియో ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా వైరల్ అయింది. నెటిజన్లు 'స్త్రీ ఇప్పుడు ఎన్ఆర్ఐ అయిపోయింది', 'స్త్రీ హెచ్ 1బీ వీసా తెచ్చుకుంది' అంటూ సరదాగా వ్యాఖ్యానిస్తున్నారు.

సంబంధిత పోస్ట్