రైలు ఏసీ బోగీలో మహిళ సాహసం: ఛార్జింగ్ సాకెట్‌తో మ్యాగీ తయారీ(వీడియో)

21973చూసినవారు
రైలు ప్రయాణంలో ఓ మహిళ చేసిన పని తీవ్ర చర్చనీయాంశమైంది. ఏసీ బోగీలో ఫోన్ ఛార్జింగ్ సాకెట్‌కు ఎలక్ట్రిక్ కెటిల్‌ను కనెక్ట్ చేసి, నీళ్లు పోసి మ్యాగీ తయారుచేసింది. ఈ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది వైరల్ అయింది. కొందరు సరదాగా స్పందిస్తుండగా, మరికొందరు ఇది ప్రమాదకరమని, రైలు విద్యుత్ వ్యవస్థపై అదనపు భారం పడి అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్