బస్సు ఆపలేదని మహిళ వీరంగం (వీడియో)

60511చూసినవారు
AP: బస్సు ఆపలేదని ఓ మహిళ నడి రోడ్డుపై వీరంగం సృష్టించారు. ఈ ఘటన కడప జిల్లా సిద్ధవటం మండలం భాకరాపేట క్రాస్ రోడ్డు వద్ద జరిగింది. ప్రయాణికులతో రద్దీగా ఉందని డ్రైవర్ బస్సును నడపగా.. మహిళ అడ్డుపడింది. డ్రైవర్ సీటు పక్కన ఉండే డోర్ నుంచి బస్సులోకి ఎక్కింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతోంది. దీనిపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ఉచిత బస్సు వల్ల ఇలాంటి ఇబ్బందులు వస్తున్నాయని చెబుతున్నారు.

సంబంధిత పోస్ట్