
రిటైర్మెంట్ తర్వాత రూ.40 కోట్ల నిల్వలు అవసరం: నిపుణులు
ప్రస్తుత కాలంలో నెలకి లక్ష నుండి రెండు లక్షలు సంపాదించేవారు, రిటైర్మెంట్ వయసు (60 ఏళ్లు) నాటికి రూ. 40 కోట్ల నిల్వలు కలిగి ఉండాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. కరోనా తర్వాత పెరిగిన ఆరోగ్య, ఆర్థిక అవసరాలు, ద్రవ్యోల్బణం, ప్రపంచ ఆర్థిక మాంద్యం వంటి కారణాల వల్ల రిటైర్మెంట్ తర్వాత ఖర్చులు ఎక్కువగా ఉంటాయని, సరైన ప్రణాళిక లేకపోతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. Dezerv కో-ఫౌండర్ సందీప్ జెట్మాని కూడా ఈ విషయాన్ని నొక్కి చెప్పారు.




