TG: ఖమ్మం నగరంలోని కస్బా బజార్లో ప్రమీల అనే మహిళ దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మహిళ హత్యకు వివాహేతర సంబంధమే కారణమని తెలిసింది. భర్తకు దూరంగా ఉంటున్న ప్రమీల, శ్రవణ్ అనే వ్యక్తితో ఎఫైర్ పెట్టుకుంది. ఈ నేపథ్యంలో తన అక్కకు అన్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో శ్రవణ్ బామ్మర్ది రాజేశ్ ఆ మహిళను హత్య చేశాడు.