మహిళ అనుమానాస్పద మృతి.. గుండెపోటుతో చనిపోయందని నమ్మించిన భర్త

85చూసినవారు
సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మల్కాపూర్‌లో సుచిత అనే మహిళ అనుమానాస్పద స్థితిలో మరణించింది. ఆమె భర్త శ్రీనివాస్, సుచిత గుండెపోటుతో చనిపోయిందని బంధువులను నమ్మించే ప్రయత్నం చేశాడు. అయితే, అంత్యక్రియల సమయంలో సుచిత గొంతు వద్ద మరకలను గమనించిన బంధువులు అనుమానంతో కొండాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్