సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియోలో ఓ మహిళ చీరకు నిప్పంటించుకుని డ్యాన్స్ చేసింది. ఆమె బంధువులు కూడా అడ్డు చెప్పకుండా చూస్తుండిపోయారు. కేవలం ఫాలోవర్స్ పెంచుకోవాలనే ఉద్దేశంతో ఇలాంటి ప్రమాదకరమైన రీల్స్ చేయడం చాలా ఆందోళన కలిగిస్తోంది. ఇలాంటి చర్యలు ప్రాణాలకే ప్రమాదం. ఫాలోవర్స్ సంపాదించడానికి ప్రాణాలను పణంగా పెట్టడం ఏమాత్రం మంచిది కాదని నెటిజన్లు అంటున్నారు. ఈ ఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగిందో స్పష్టత లేదు.