మహిళపై లైంగిక దాడి ఆపై హత్య.. నిందితుడు అరెస్ట్

22716చూసినవారు
మహిళపై లైంగిక దాడి ఆపై హత్య.. నిందితుడు అరెస్ట్
TG: మహిళపై లైంగిక దాడి చేసి హత్య చేసిన నిందితుడిని పంజాగుట్ట పోలీసులు శనివారం అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. ఈ నెల 23న అమీర్పేట్ గ్రీన్ ల్యాండ్స్ సమీపంలో అస్సాంకు చెందిన లీసా(30)ఒంటిపై గాయాలతో విగతజీవిగా పడి ఉంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ, సెల్ ఫోన్ సిగ్నల్ ద్వారా నిందితుడు అనంతపురం జిల్లా నల్లచెర్వు మండలం ఈనామల్లపల్లి గ్రామానికి చెందిన వై. రెడప్పగా గుర్తించారు. శనివారం నిందితుడిని అరెస్టు చేశారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్