లిఫ్ట్‌-ఫ్లోర్ మధ్యలో ఇరుక్కున్న మహిళ.. చివరికి (వీడియో)

19113చూసినవారు
AP: ప్రకాశం జిల్లా ఒంగోలులోని ఓ అపార్ట్‌మెంట్‌లో జరిగిన లిఫ్ట్ ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ప్రమాదవశాత్తూ లిఫ్ట్-ఫ్లోర్ మధ్యలో ఇరుక్కున్న వనీత(50) అనే మహిళ.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది. లిఫ్ట్‌లో కుమార్తె, మనవడితో కలిసి వనీత వచ్చారు. ఈ క్రమంలో గేట్లు వేయకుండానే లిఫ్ట్ కిందకు దిగిపోయింది. దాంతో వనీత లిఫ్ట్-ఫ్లోర్ మధ్యలో ఇరుక్కున్నారు. స్థానికులు ఆమెను బయటకు తీసి ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ఆమె మృతి చెందారు.

సంబంధిత పోస్ట్