గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఒక జ్యువెలరీ స్టోర్‌లోకి చొరబడిన మహిళ చోరీకి ప్రయత్నించింది. ఈ క్రమంలో యజమాని కంట్లో కారం చల్లింది. అయితే, యజమాని చాకచక్యంగా వ్యవహరించి, ఆమెపై దాడి చేసి కొట్టాడు. అనేక సార్లు చెంపదెబ్బలు కొట్టి బయటకు గెంటేశాడు. ఈ ఘటన సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.