బిహార్ ఎన్నికల్లో గెలిచే వరకు మాస్క్ తీయనని మహిళ శపథం.. ఎవరామె?

11609చూసినవారు
బిహార్ ఎన్నికల్లో గెలిచే వరకు మాస్క్ తీయనని మహిళ శపథం.. ఎవరామె?
ది ప్లూరల్స్ పార్టీ అధినేత్రి పుష్పం ప్రియ చౌదరి ఎన్నికల్లో గెలిచిన తర్వాతే ముఖానికి ఉన్న మాస్క్‌ను తొలగిస్తానని చేసిన ప్రతిజ్ఞ నెరవేరేలా కనిపించడం లేదు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో, ఆమె దర్భంగా అసెంబ్లీ స్థానంలో BJP అభ్యర్థి సంజయ్ సరావగి కంటే 26,000 ఓట్లకు పైగా వెనుకబడి ఉన్నారు. 2020లో స్థాపించిన ఆమె పార్టీ, ఈ ఎన్నికల్లో రాష్ట్రంలోని 243 స్థానాల్లో విజిల్ గుర్తుపై పోటీ చేసినా, ఒక్కచోట కూడా ఆధిక్యంలో లేదు. దీంతో ఆమె ఇక మాస్క్ తీయదా అంటూ నెట్టింట చర్చిస్తున్నారు.