టూత్‌బ్రష్‌ను మింగేసిన మహిళ

582చూసినవారు
టూత్‌బ్రష్‌ను మింగేసిన మహిళ
కోల్‌కతాలో ఓ మహిళ(37) మింగేసిన టూత్‌బ్రష్‌ను వైద్యులు అతికష్టం మీద బయటకు తీశారు. ఓ మహిళ విపరీతమైన కడుపునొప్పితో ఆసుపత్రికి వచ్చింది. శ్వాస తీసుకోవడం కూడా ఇబ్బందిగా ఉందని, ఛాతీలోనూ నొప్పిగా ఉన్నట్లు చెప్పింది. ఆమెకు ఎక్స్‌రే, జీఐ ఎండోస్కోపీ చేసిన వైద్యులు విస్తుపోయారు. ఆమె పొట్టలో టూత్‌బ్రష్‌ ఉన్నట్లు గుర్తించారు. వైద్యులు 45 నిమిషాలు కష్టించి ఎండోస్కోపీ సాయంతో నోటి ద్వారా దారాన్ని పంపి బ్రష్‌ను బయటకు లాగారు.