యూపీలోని ఎటావా జిల్లా షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. గ్రామంలోని మద్యం దుకాణం కారణంగా పురుషులు తాగుడుకు బానిసలై, నిత్యం గొడవలు చేస్తూ ఇళ్లను నరకంగా మారుస్తున్నారని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతా ఒక్కటై ఒక్కసారిగా మద్యం షాపుపై దాడి చేసి, అక్కడి సామాగ్రిని తలకిందులు చేశారు. వేల సంఖ్యలో ఉన్న మద్యం సీసాలను పగులగొట్టి తమ నిరసనను తెలిపారు. షాపు నిర్వాహకులు భయాందోళనకు గురై అక్కడి నుండి పరుగులు తీశారు.