
ఏపీలో నాలుగు రోజులపాటు భారీ వర్షాలు: వాతావరణ శాఖ
AP: ఉత్తర అండమాన్ సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారి, ఈ నెల 23న ఉత్తర కోస్తా-దక్షిణ ఒడిశా మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో నాలుగు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురవనున్నాయి. ఈ నేపథ్యంలో కాకినాడ, అల్లూరి, తిరుపతి, నెల్లూరు, కడప తదితర జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని, తీరం వెంబడి గంటకు 40-50 కి.మీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని అధికారులు హెచ్చరించారు.




